యూఎస్ లో 11 మిలియన్ మార్క్ ను టచ్ చేసిన RRR

Published on Apr 1, 2022 1:14 am IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం యుఎస్‌లో డ్రీమ్ రన్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసి ఇంకా జోరు కొనసాగిస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం బుధవారం $338,502 వసూలు చేసింది. దీంతో ఈ సినిమా మొత్తం కలెక్షన్లు 10,750,361కి చేరాయి. మంగళవారం నాటికి ఈ సినిమా 11 మిలియన్ల మార్కును దాటడం విశేషం.

రాజమౌళికి ఉన్న క్రేజ్, స్టార్ హీరోల హవా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :