“RRR” ఓటిటి వీక్షకుల నుంచి ఈ కంప్లైంట్స్..!

“RRR” ఓటిటి వీక్షకుల నుంచి ఈ కంప్లైంట్స్..!

Published on May 23, 2022 5:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నాక ఇప్పుడు ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యి సాలిడ్ రెస్పాన్స్ మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా అందుకుంటుంది.

అయితే హిందీ మరియు దక్షిణాది భాషల్లో నెట్ ఫ్లిక్స్, జీ 5 లలో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది కానీ సౌత్ వెర్షన్ ని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చిన నెట్ ఫ్లిక్స్ వారికి మాత్రం వీక్షకుల నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి.

సినిమా ముందు వారు చెప్పినట్టుగా బెస్ట్ క్వాలిటీలో లేదని ముఖ్యంగా సౌండ్ క్వాలిటీ సరిగ్గా లేదని ఆ సౌండ్ ఎక్స్ పీరియన్స్ ని తాము సరిగ్గా ఫీల్ అవ్వట్లేదని వారికి కంప్లైంట్ చేస్తున్నారు. దీనితో ఈ సమస్యని సాల్వ్ చేస్తామని జీ 5 వారు ఆడియెన్స్ ని తెలియజేస్తున్నారు. మరి ఇదెప్పుడు పూర్తవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు