వరల్డ్ వైడ్ “RRR” బుకింగ్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే.!

Published on Mar 24, 2022 4:25 pm IST


మరికొన్ని గంటల్లో నాలుగేళ్ల నిరీక్షణకు తెర పడబోతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సహా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “రౌద్రం రణం రుధిరం”. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో అత్యంత గ్రాండ్ గా విడుదల అవుతుంది.

మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా బుకింగ్స్ అన్ని ఏరియాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు సమాచారం తెలుస్తుంది. మొదటగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆన్లైన్ బుకింగ్స్ సెన్సేషన్ అని చెప్పాలి. మొదటి రోజు అయితే పక్కాగా ఒక సరికొత్త రికార్డు ఈ సినిమాకి నమోదు ఖాయం కన్ఫర్మ్ అయ్యింది.

ఇక దీనితో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళనాడులో పర్వాలేదనిపించే స్థాయిలో బుకింగ్స్ ఉన్నాయట. అలాగే చెన్నై సిటీ లో మాత్రం RRR మంచి హోల్డ్ కనబరుస్తుంది. అలాగే మళయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా బుకింగ్స్ పర్వాలేదట.

ఇక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ బుకింగ్స్ మాత్రమే సాలిడ్ గా ఉండగా మిగతా భాషల్లో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయట. ఇక అత్యంత కీలకమైన మరో మార్కెట్ హిందీ బెల్ట్ విషయానికి వస్తే ఇండియాలో ఈ చిత్రం ఆన్ లైన్ బుకింగ్స్ ఊహించని రీతిలో చాలా డల్ గా ఉన్నాయి.

ఇప్పటికి కూడా దాదాపు హిందీలో అన్ని ప్రాంతాల్లోని ఈ సినిమా బుకింగ్స్ ఊపందుకోకపోవడం గమనార్హం. దీనితో హిందీలో ఫస్ట్ డే ఫిగర్స్ ఎలా వస్తాయా అనేది ఆసక్తిగా మారింది. ఇలా ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ సినిమా బుకింగ్స్ నడుస్తున్నాయి. మరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ RRR చిత్రం ఎలాంటి నెంబర్ ని నమోదు చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :