వైరల్ : పవన్ రేంజ్ స్టార్ ఎవరూ లేరు – ‘RRR’ రచయిత మాట!

Published on Apr 2, 2022 4:05 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మన తెలుగు రాష్ట్రాల్లో గాని ఓవర్సీస్ లో గాని ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. తన ఫాలోయింగ్ ఏపాటిదో తన ఎలాంటి సినిమాకి అయినా వచ్చే ఓపెనింగ్స్ చెబుతాయి. మరి లేటెస్ట్ గా అయితే పవన్ క్రేజ్ కి సంబంధించి ఇండియాస్ లేటెస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ అయినటువంటి “రౌద్రం రణం రుధిరం” సినిమా రచయిత వి విజయేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెయ్యడం ఆసక్తిగా మారింది.

RRR సినిమా వేరే స్టార్స్ తో చెయ్యాల్సి వస్తే అనే దానిపై మాట్లాడుతూ పవన్ తో విషయానికి వస్తే పవన్ రేంజ్ ని మ్యాచ్ చేసే స్టార్ ఎవరూ లేరని తానొక సూపర్ డూపర్ మెగాస్టార్ అందుకే అలాంటి ఆలోచనే రాలేదని తెలిపారు. అలాగే బాహుబలి 2 లో ఇంటర్వెల్ బ్లాక్ కి కారణం కూడా పవన్ కళ్యాణ్ నే అని మరోసారి ప్రస్తావించారు. దీనితో పవన్ పై ఈ రేంజ్ లో ఎలివేషన్ పడ్డాక పవన్ అభిమానులు ఈ వీడియో ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :