వైరల్ : “RRR” నాటు నాటు కి ఇంగ్లీష్ వెర్షన్ చూసారా.?

Published on Oct 1, 2022 8:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించినటువంటి లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూసాము. ఇప్పటికీ కూడా ఈ చిత్రం విదేశాల్లో ఎన్నో ప్రాంతాల నుంచి సినిమాకి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది.

అయితే ఈ చిత్రంలో సూపర్ హిట్ నెంబర్ అయినటువంటి నాటు నాటు కి కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. మరి దీనిని పాన్ ఇండియా భాషల్లో మనం విన్నాం కానీ ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్ సాంగ్ బయటకి వచ్చింది. ఒక కాన్సెప్ట్ వీడియో లా కొంతమంది ఫారినర్స్ అయితే ఈ సాంగ్ ని ఇంగ్లీష్ వెర్షన్ లో లిరిక్స్ సమకూర్చుకొని దానికి డాన్స్ వీడియో లా కూడా చేసుకున్నారు. ఇది అయితే మంచి ఫన్ గా సాగగా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :