“ఇండియన్ 2” కోసం “RRR” ఆస్కార్ కొరియోగ్రాఫర్ ని తీసుకున్న శంకర్.!

Published on Jan 28, 2023 7:05 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలతో ఉన్న చిత్రాల్లో ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకుల్లో ఒకరైన మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “ఇండియన్ 2” కూడా ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సెన్సేషనల్ ఎమోషనల్ హిట్ ఇండియన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొనగా లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం శంకర్ RRR నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శంకర్ సినిమాల్లో సాంగ్స్ ఏ లెవెల్లో ఉంటాయో తెలిసిందే. అలా ఈ సినిమాలో ఓ కీలక సాంగ్ కోసం గాను RRR నుంచి ఆస్కార్ కి ఎంపికైన నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని అయితే శంకర్ తీసుకున్నట్టుగా ఇప్పుడు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి వీరి కలయికలో ఆ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :