ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌పై ” ఆర్ఆర్ఆర్ ” ప్రీమియర్ షో..!

Published on Mar 3, 2022 1:00 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది.

యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియేటర్‌లో ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నారట. అంతేకాకుండా యూకేలో వెయ్యి స్క్రీన్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :