లేటెస్ట్ : ఆకట్టుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ రీ రిలీజ్ ట్రైలర్

Published on Feb 27, 2023 5:32 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో రూపొందిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ గత ఏడాది మార్చి 24న రిలీజ్ అయి ప్రారంచావ్యాప్తంగా ఎంతో పెద్ద సంచలన విజయం అందుకుంది. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రే స్టీవెన్సన్, ఎలిసన్ డూడి తదితరులు కీలక పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమురం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా తమ అత్యద్భుత నటనతో గ్లోబల్ గా ఆడియన్స్, ఫ్యాన్స్ మనసు దోచారు.

కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ దాదాపుగా రూ. 1200 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని దక్కించుకోవడంతో పాటు ప్రస్తుతం పలు అంతర్జాతీయ అవార్డులని సైతం అందుకుంటోంది. అయితే విషయం ఏమిటంటే, ఈ భారీ మూవీని మరొక్కసారి ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. మార్చి 3 న దాదాపుగా 200 కి పైగా థియేటర్స్ లో ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. కాగా ఆర్ఆర్ఆర్ యొక్క రీ రిలీజ్ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేసారు. ఇక ఎంతో అలరించేలా రూపొందించిన ఈ ట్రైలర్ ప్రస్తతం ప్రేక్షకాభిమానుల నుండి మంచి ఆదరణ అందుకుంటోంది. మరి రీ రిలీజ్ తరువాత ఆర్ఆర్ఆర్ ఎంత మేర కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :