జపాన్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ !

జపాన్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ !

Published on Oct 23, 2022 5:05 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేసింది. కాగా ఇటీవల జపాన్ భాషలోకి అనువదింపబడిన ఈ చిత్రం ఘనంగా విడుదలైంది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు ఏకంగా రూ. 25 కోట్ల కలెక్షన్లు వచ్చాయని టాక్ నడుస్తోంది.

మొత్తానికి ఈ చిత్రానికి జపాన్ లో సైతం రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకూ జపాన్ లో రిలీజ్ అయిన భారతీయ సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సిమిమాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిలవడం విశేషం. ఇక ప్రస్తుతం ఈ సినిమా టీమ్ జపాన్ లో ఫుల్ ప్రమోషన్స్ చేస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, చరణ్ దంపతులు హుషారుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు