“RRR”..హాలీవుడ్ మ్యూజిక్ అవార్డ్స్ లో ‘నాటు నాటు’.!

“RRR”..హాలీవుడ్ మ్యూజిక్ అవార్డ్స్ లో ‘నాటు నాటు’.!

Published on Nov 4, 2022 8:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఇండియాస్ బెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం పాన్ వరల్డ్ వైడ్ కూడా భారీ రీచ్ తో సెన్సేషన్ ని రేపింది. ఇక ఈ చిత్రంలో ఉన్న చార్ట్ బస్టర్ నెంబర్ నాటు నాటు అయితే ఫారిన్ ఆడియెన్స్ లో కూడా మరింత స్థాయిలో హిట్ అయ్యింది. ఎన్నో కవర్ సాంగ్స్ ఇంగ్లీష్ వెర్షన్ సాంగ్స్ కూడా దీనిపై చేశారు.

మరి అలా అయితే హాలీవుడ్ లో బెస్ట్ ఫారిన్ సినిమా సాంగ్స్ జాబితాలో అయితే పలు ఇంగ్లీష్ సాంగ్స్ తో పాటుగా నాటు నాటు కూడా ఇప్పుడు నామినేషన్స్ లో మరి ఈ ప్రముఖ అవార్డు అందుకునే లిస్ట్ లో అయితే నాటు నాటు కి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నట్టు కూడా గట్టి టాక్ నడుస్తుంది. దీనితో ఈ ఉదయం న్యూస్ తో చిత్ర టీం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. ఇక ఈ అవార్డ్స్ అయితే ఈ నవంబర్ 16న అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు