జపాన్ లో “ఆర్ఆర్ఆర్” ఆల్ టైమ్ రికార్డ్

Published on Feb 19, 2023 11:00 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ రౌద్రం రణం రుధిరం చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో పాటుగా, ఆస్కార్ కి కూడా నామినేట్ అవ్వడం తో ఇండియన్ మూవీ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఒక స్టాండర్డ్ ను సెట్ చేయడం జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ల నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

అయితే RRR చిత్రం జపాన్‌లో అనేక రికార్డులను చెరిపివేసింది. అక్కడ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచిన విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా ఇప్పుడు అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. 1 బిలియన్ జపనీస్ యెన్ మార్కును దాటింది. ఇది భారతీయ రూపాయలలో సుమారు 63 కోట్ల రూపాయలు. ఇది ఒక చారిత్రాత్మక ఫీట్. ఈ దేశంలో సినిమా లాంగ్ రన్ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా ఆస్కార్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 12 వ తేదీన దీని ఫలితాలు ప్రకటించనున్నారు. నాటు నాటు పాట ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డును సాధించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :