“ఆర్ఆర్ఆర్” కన్నడ వెర్షన్ విడుదల పై టీమ్ క్లారిటీ!

Published on Mar 23, 2022 5:00 pm IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. మార్చ్ 25 వ తేదీన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దం అవుతోంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. కర్ణాటక లో పలు పరిస్థితుల రీత్యా ఆర్ ఆర్ ఆర్ విడుదల పై పలు అనుమానాలు కలుగుతున్నాయి.ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక నోట్ ను విడుదల చేయడం జరిగింది.

అయితే ఈ చిత్రం లో ప్రధాన పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఈ చిత్రం కోసం ఎంతగానో కష్ట పడ్డారు అని, కన్నడ డబ్బింగ్ వారే చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు. కన్నడ లో చిత్రం ను ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని, కన్నడ వెర్షన్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తాం అని, రేపటి వరకూ మరిన్ని ధియేటర్ లను కేటాయిస్తామని తెలిపారు. ఇందుకు సహకారం అందుతుంది అనే నమ్మకం ఉందని అన్నారు. ఈ మేరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ రిలీజ్ చేసిన నోట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :