రానా దగ్గుపాటి ఇంట్లో రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్…ఎందుకంటే?

Published on Dec 22, 2021 7:00 pm IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈచిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది.

ఇప్పటికే హిందీ లో బాలీవుడ్ ప్రేక్షకులు కోసం ప్రీ రిలీజ్ వేడుక ను కూడా జరపగా, ఇప్పుడు సరికొత్తగా ఒక ఫోటో ను ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ విడుదల చేయడం జరిగింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రానా దగ్గుపాటి లో కలవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూ లతో బిజిగా ఉన్న జక్కన్న, టాలీవుడ్ లో త్వరలో ప్రమోషన్స్ ను షురూ చేయనున్నారు. టాలీవుడ్ లోని దిగ్గజ నటులు ఇక్కడ ప్రీ రిలీజ్ వేడుక కి హాజరు కానున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :