ఎన్టీఆర్ – చరణ్ అడిగితే, జగన్ అనుమతిస్తాడా ?

Published on Nov 14, 2021 10:00 pm IST

‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రస్తుత సమస్యల్లో ఆంధ్రలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఒక్కటి. ఒక విధంగా ఇది అతి పెద్ద సమస్య అయిపోయింది. టికెట్ రేట్లు పెంచకపోతే.. పెద్ద సినిమాలకు నష్టం. అయినా టికెట్ రేట్ల పెంపు విషయంలో జగన్ సానుకూలంగా లేరని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత డీవీవీ దానయ్య అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ పెట్టడంతో ఈ అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

అయితే, దానయ్య మెసేజ్ లో ఒక కామెంట్ పెట్టాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్‌ ను మా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కలిసి మా పరిస్థితిని తెలియజేస్తాము. మాకు న్యాయం జరిగేలా తగిన పరిష్కారాన్ని కోరుతాము’’ అంటూ పోస్ట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ టీమ్ అంటే.. ఎన్టీఆర్ – చరణ్ కూడా కదా. మరి ఎన్టీఆర్, చరణ్ కలిసి వెళ్లి అడిగితే, జగన్ ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ రేటును పెంచుకోవడానికి అనుమతిస్తారా ? చూడాలి.

సంబంధిత సమాచారం :