హాలీవుడ్ అవార్డ్స్ లో మరో ప్రిస్టేజియస్ అవార్డుతో “RRR”.!

Published on Feb 25, 2023 11:14 am IST


లేటెస్ట్ గా మన టాలీవుడ్ ప్రైడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం సెన్సేషన్ వరల్డ్ వైడ్ గా అలా కొనసాగుతూనే వస్తుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ లో అయితే మెరిసింది. అందులో బెస్ట్ యాక్షన్ చిత్రం బెస్ట్ స్టంట్స్ అలాగే బెస్ట్ సాంగ్ విషయంలో గెలుపొందింది.

అంతే కాకుండా ఇప్పుడు అయితే మరో ప్రిస్టేజియస్ అవార్డును చిత్ర యూనిట్ తమ బ్యాగ్ లో వేసుకుంది. ఇందులో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరీ లో మొదటి స్థానంలో నిలిచి RRR అదరగొట్టింది. దీనితో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుండగా ఈ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళి మరియు రామ్ చరణ్ లు తమ నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని తెలిపారు. దీనితో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :