లండన్‌లో ‘రుద్రమదేవి’ రీ-రికార్డింగ్!

rudhramadevi
గుణశేఖర్ కలల ప్రాజెక్టుగా చెప్పబడుతున్న చారిత్రక సినిమా.. ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషించగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు. హీరో రానా, నిత్యామీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియోతో సినిమా పట్ల అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యాజిక్ పాటల్లో కనిపించిందని ఆడియో ద్వారా ఇప్పటికే ఋజువైంది.

ఇక తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్‌కి సంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. తనకెంతో ఇష్టమైన లండన్‌లోని ఓ రికార్డింగ్ థియేటర్‌లో ఇళయరాజా రుద్రమదేవి రికార్డింగ్ పనులు చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతీ విభాగం అధ్భుతం అనిపించేలా చేయడానికి అన్ని విధాలా కష్టపడుతున్నారు. రీ రికార్డింగ్‌కి సంబంధించిన కార్యక్రమాలు జరగనున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఇళయరాజాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేసవిలోనే ఈ ప్రతిష్టాత్మక 3డీ చిత్రం విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version