ఓటిటి లోకి వచ్చేసిన రుహానీ శర్మ ‘HER”

Published on Sep 16, 2023 12:00 am IST

రుహానీ శర్మ తన కెరీర్‌లో గ్లామరస్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆమె అందరినీ ఆశ్చర్య పరుస్తూ HER అనే కాప్ థ్రిల్లర్‌ లో నటించింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది జూలై 21న విడుదలైంది. ప్రముఖ ప్లాట్‌ఫారమ్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను పొందింది. ఇప్పుడు సినిమా ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతోంది.

ఈ చిత్రంలో రుహానీ శర్మ పోలీసుగా నటించింది. ఆమె పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిజ్ఞ, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ, రవి ప్రకాష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. డబుల్ అప్ మీడియా పతాకంపై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పవన్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :