హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయడానికి శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా శర్వానంద్ లేని సీన్స్ ను షూట్ చేయాలని కసరత్తులు చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ రెడీ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అన్నట్టు శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను మళ్లీ కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
