కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం ‘రూలర్’. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతొంది ఈ చిత్రం. కాగా నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తోంది.
ఇక `జైసింహా` వంటి విజయవంతమైన చిత్రం తర్వాత కె.ఎస్.రవికుమార్ – బాలయ్య హిట్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనపడతారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
