కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Sep 5, 2023 10:02 pm IST

ప్రస్తుతం మంచి సినిమాలతో కెరీర్ పరంగా పలు సక్సెస్ లతో కొనసాగుతున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా తాజాగా తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ డ్రామా మూవీ రూల్స్ రంజన్. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా ముఖ్యంగా సమ్మోహనుడా పల్లవితో సాగె సాంగ్ అయితే మరింత క్రేజ్ అందుకుంది. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళి కృష్ణ వేమూరి భారీగా నిర్మిస్తున్న రూల్స్ రంజన్ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని సెప్టెంబర్ 8న ఉదయం 11 గం. 22 ని. లకు విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. అమ్రిష్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్ అంచనాలు అందుకుని సక్సెస్ సాదిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రూల్స్ రంజన్ తో నటుడు కిరణ్ అబ్బవరం ఎంత మేర విజయం అందుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :