బాలకృష్ణ సినిమాపై దుష్ప్రచారం

Gautamiputra-Satakarni
బాలకృష్ణ నూరవ చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిన తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పై అప్పుడే కొందరు దుష్ప్రచారం మొదలెట్టారు. నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఏ ఏరియాకు ఇప్పటి వరకు బిజినెస్ మొదలుపెట్టలేదు. అయితే ఓ వెబ్ సైట్ లో అదే పనిగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ఈస్ట్ గోదావరి హక్కులను వింటేజ్ సంస్థ కొనుగోలు చేసిందని రాశారు. సదరు వింటేజ్ సంస్థను సంప్రదించగా అలాంటిదేమీ లేదని వారు చెప్పారు. ఈ సినిమాను ఇంతకు కొనుగోలు చేశారని రాసిన సైట్ వాళ్ళు మరో సినిమాను మరింత రేటుతో కొన్నట్టుగా ప్రచారం సాగించారు. ఇప్పటికే అన్ని వర్గాల్లోనూ ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. అది గిట్టని వాళ్ళు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బిజినెస్ పై దెబ్బ తీయాలని ఇలాంటి ప్రచారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి అన్ని ఏరియాల నుంచీ విపరీతమైన ఫ్యాన్సీ ఆఫర్స్ ఉన్నప్పటికీ నిర్మాతలు ఇంకా బిజినెస్ మొదలు పెట్టలేదని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.