2.0 రన్ టైం లాక్ !

శంకర్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘2.0’ చిత్రం విడుదలకు కేవలం 8రోజుల సమయం మాత్రమే వుంది. ఇక కోలీవుడ్ చిత్ర వర్గలా నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈచిత్రం 2గంటల 28 నిమిషాల 52 సెకండ్ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుందట. మాములుగా శంకర్ సినిమాలకు రన్ టైం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈచిత్రానికి మాత్రం తక్కువ రన్ టైం ను కేటాయించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందించారు. సుమారు 600కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

ఇక ఈచిత్రం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ స్క్రీన్ లలో విడుదలకానుంది. సూపర్ హిట్ చిత్రం ‘రోబో’ కి సీక్వెల్ గా వస్తున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version