‘2.0’ రన్ టైమ్ ఎంతో తెలుసా!

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ ల కానుకలో రూపొందుతున్న ‘2.0’ ముగింపు దశకు చేరుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రణపై దక్షిణాది పరిశ్రమలోనే గాక యావత్ భారతదేశ సినీ ప్రేక్షకుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి. ఇప్పటికే పాటల్ని దుబాయ్ లో అట్టహాసంగా లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిన ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు రన్ టైమ్ తో మరింత సప్రైజ్ చేసింది.

త్రీడీ ఫార్మాట్లో రిలీజ్ కానున్న ఈ చిత్ర నిది 100 నిముషాల పాటు మాత్రమే ఉంటుందని టాక్. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తమిళంల, హిందీ, తెలుగు, అరబిక్ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో అక్షయ కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండగా, యామీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏ.ఆర్ రెహామన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నారు.