రెండున్నర గంటల రన్ టైమ్ తో దిగుతున్న బోయపాటి!


దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘జయ జానకి నాయక’ ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన సంగతి తెల్సిందే. కాగా తాజాగా సినిమా రన్ టైం ఎంతో కూడా రివీల్ చేశారు చిత్ర టీమ్. సాధారణంగా బోయపాటి సినిమాల్లో కాస్త ఎక్కువగానే ఉండే రన్ టైమ్ సినిమాలో మాత్రం ఇంకొద్దిగా పెరిగి 149.27 సెకన్లు అనగా దాదాపుగా రెండున్నర గంటలుగా ఉంది.

మామూలుగా ఇంత రన్ టైం కొద్దిగా ఎక్కువనే చెప్పాలి. కానీ ఈ సినిమా మాత్రం ఒకవైపు ప్రేమ, మరోవైపు యాక్షన్ తో వేగంగా నడుస్తుందని, కనుక రన్ టైమ్ ఇబ్బందేమీ కాదని అంటున్నారు. ఇక ఈ శుక్రవారం ‘లై, నేనే రాజు నేనే మంత్రి’ లాంటి సినిమాలు విడుదలవుతుండటంతో ఈ చిత్రం వాయిదాపడుతుందని వచ్చిన వార్తలన్నిటినీ కొట్టిపారేస్తూ సినిమా అదే 11వ తేదీన రిలీజవుతుందని తేలిపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ కాగా క్యాథరిన్ థ్రెస, ప్రగ్య జైస్వాల్ లు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.