విస్మయానికి గురిచేస్తున్న ‘అర్జున్ రెడ్డి’ రన్ టైమ్ !


సాధారణంగా మన తెలుగు సినిమాల రన్ టైమ్ 2 గంటల 10 నిముషాలు లేదా మహా అయితే 2 గంటల 20 నిముషాల వరకు ఉంటుంది. కానీ త్వరలో విడుదలకానున్న విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ రన్ టైమ్ మాత్రం విస్మయానికి గురిచేసే విధంగా 2 గంటల 55 నిముషాలు అనగా దాదాపు 3 గంటల సేపు ఉండనుంది. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ రన్ కలిగిన సినిమా ఇదేనని చెప్పోచ్చు.

ఈ వార్తను విన్న చాలా మంది సినీ జనాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమేగాక ఒకరకంగా ఇది సాహసమనే చెప్తున్నారు. 3 గంటల సేపు ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోబెట్టాలంటే సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే తప్ప సాధ్యంకాదని అంటున్నారు. మరోవైపు చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా ఫలితంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ నెల 25న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.