‘సంక్రాంతికి వస్తున్నాం’ రన్‌టైమ్ లాక్.. ఎంతంటే?

‘సంక్రాంతికి వస్తున్నాం’ రన్‌టైమ్ లాక్.. ఎంతంటే?

Published on Jan 11, 2025 3:01 AM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సె్స్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. కాగా మరో రెండు సినిమాలతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ పోటీ పడుతుండటంతో ఈ మూవీ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో యాక్షన్, కామెడీలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను పక్కా కమర్షియల్ సినిమాగా మలిచాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 22 నిమిషాలుగా ఫిక్స్ చేశారట మేకర్స్. ఓ కమర్షియల్ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని చెప్పాలి. ఇక ఆడియెన్స్‌కు ఏమాత్రం బోర్ కొట్టకుండా ఈ సినిమాలోని కంటెంట్ ఉంటే, మూవీ బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రెజెంట్ చేయగా శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు