మెగాస్టార్ “ఆచార్య” రన్‌టైమ్ లాక్ అయ్యిందా?

Published on Apr 25, 2022 2:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29, 2022 నుండి ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ ను పొందింది.

ఈ చిత్రం రన్ టైం పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం 154 నిమిషాల రన్ టైం ఉన్నట్లు తెలుస్తోంది. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు కూడా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో భాగమయ్యారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :