‘ఫంకీ’ రన్‌టైమ్ లాక్ చేసిన అనుదీప్.. విశ్వక్‌కు ఈసారి హిట్టు దక్కేనా..?

Funky

మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’(Funky) ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ చిత్రాన్ని ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని తమదైన రీతిలో ప్రమోట్ చేస్తూ దూసుకెళ్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు అనుదీప్.

ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమా రన్‌టైమ్‌ను తాజాగా లాక్ చేశారు. ఈ చిత్రం కేవలం 2 గంటల 8 నిమిషాల నిడివితో చాలా క్రిస్పీగా ఉండబోతోంది. సాధారణంగా కామెడీ సినిమాలకు నిడివి తక్కువగా ఉంటేనే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేయగలరని, అందుకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపిస్తుండగా, ఆయన సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అనుదీప్ కేవీ మార్క్ సిల్లీ అండ్ విభిన్నమైన కామెడీ టైమింగ్‌తో ఈ రన్‌టైమ్ మొత్తం నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. కేవలం రెండు గంటల పైచిలుకు సమయం కావడంతో కథనం చాలా వేగంగా సాగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Exit mobile version