“కాంతారా” మ్యూజిక్ డైరెక్టర్ తో దర్శకుడు అజయ్ భూపతి.!

Published on Nov 30, 2022 5:40 pm IST

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర మూవీ లవర్స్ ని కట్టిపడేసిన ఎన్నో చిత్రాల్లో కన్నడ సెన్సేషన్ “కాంతారా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం చూసాక డెఫినెట్ గా ఈ సినిమా పాటల కోసం కూడా తప్పకుండా మాట్లాడుకున్నారు. అలాగే దీనితో పాటుగా కన్నడ నుంచే వచ్చిన మరో చార్ట్ బస్టర్ సాంగ్ “రా రా రక్కమ్మ” కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అయ్యింది.

మరి ఇలాంటి క్రేజీ ఆల్బమ్స్ ని ఇచ్చిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ ని అయితే మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి తన లేటెస్ట్ సినిమా “మంగళవారం” తో టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు. మరి ఆల్రెడీ అజయ్ భూపతి తన మ్యూజిక్ సెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో తన ఫస్ట్ సినిమా “ఆర్ ఎక్స్ 100” తోనే చూపించాడు.

మరి ఇలాంటి దర్శకుడు కన్నడలో సూపర్ హిట్ సంగీతం అందిస్తున్న అజనీష్ తో వర్క్ చేస్తున్నాడని తెలియడం ఆసక్తిగా మారింది. మరి ఈ కాంబినేషన్ లో మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :