నాని సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ !

టాలెంటెడ్ డైరెక్టర్ ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని తన 24వ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఈ రోజు అధికారికంగా ప్రారంభం అయింది. అయితే ఈ సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం పూర్తి థ్రిల్లర్ గా ఉండబోతుందని, అలాగే ఆడవారికి సంబందించిన మంచి సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుందట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కెమెరామేన్ పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

Exit mobile version