‘ఆర్ఎక్స్ 100’ నిర్మాతకు లక్ మామూలుగా లేదుగా !

ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై మిక్సడ్ టాక్ వచ్చిన కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్నిసాధించింది ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం. కేవలం థియేట్రికల్ రన్ ద్వారానే మంచి లాభాలను ఖాతాలో వేసుకున్నాడు ఈసినిమా నిర్మాత అశోక్ గుమ్మకొండ.

ఇక ఆయనకు ఇప్పుడు ఈసినిమా పెద్ద వరం లా మారింది. తాజాగా ఈచిత్రం తమిళ , కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అవుతుంది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కుల గాను సుమారు కోటి 50లక్షల రూపాయలను చెల్లించారట ప్రముఖ హిందీ నిర్మాత. ఇక కన్నడ కు కూడా పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేశారట.

ఇవి గాక ఆయనకు శాటిలైట్ హక్కుల రూపంలోనూ కలిసొచ్చింది. ఇక లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రంతో నిర్మాతకు కాసుల పంట పండింది. కార్తికేయ ,పాయల్ రాజ్ పుత్ జంటగా అజయ్ భూపతి ఈచిత్రాన్ని తెరకెక్కించాడు.

Exit mobile version