
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. విడుదలై వారం దాటినా ఈ సినిమా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ యాక్టింగ్‌కు, త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక భారీ ఎత్తున ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వడం, సినిమాకు మంచి స్పందన రావడంతో ‘S/O సత్యమూర్తి’ మొదటి వారం కలెక్షన్లను కుమ్మేసింది. సమంత, నిత్యామీనన్, అదాశర్మలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఇక ‘S/O సత్యమూర్తి’ విడుదలైన అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సందర్భంగా సినిమా యూనిట్ ఓ థ్యాంక్యూ మీట్‌కు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓసారి వాయిదా పడిన ఈ థ్యాంక్స్ మీట్, తాజాగా మరోసారి వాయిదా పడింది. మొదట ఏప్రిల్ 18న ‘S/O సత్యమూర్తి’ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. తర్వాత ఆ తేదీ ఏప్రిల్ 22కు వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు ఏప్రిల్ 23వ తేదీకి ఫిక్స్ చేశారు. వైజాగ్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హీరో, దర్శకుడితో పాటు సినిమా యూనిట్ మొత్తం ఈ వేడుకలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.