మలేషియాలో క్లైమాక్స్ షూట్ జరుపుకుంటున్న ‘సింగం 3’

25th, August 2016 - 08:59:04 AM

singham3
హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘సింగం 3’. ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన సింగం, సింగం 2 చిత్రాలు సూపర్ హిట్ అవడంతో ఈ పార్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడాని దర్శకుడు హరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండేట్లు చూసుకుంటున్నాడు. ఇప్పటికే నెల్లూరు, వైజాగ్, చెన్నై, బల్గెరియా వంటి ప్రాంతాల్లో యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు మలేషియా వెళ్లనుంది.

రెండు వారాల పాటు మలేషియాలోనే సినిమా క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను టీమ్ చిత్రీకరించనుంది. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇకపోతే అనుష్క, శృతి హాసన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకులను అలరించనుంది.