‘సాహసం శ్వాసగా..’ యూఎస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

Sahasem-savasaga-sagipo
దర్శకుడు గౌతమ్ మీనన్ – హీరో నాగ చైతన్య కలిసి చేసిన ‘ఏమాయ చేశావే’కి కల్ట్ క్లాసిక్ అన్న పేరుంది. తాజాగా ఈ కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమాయే ‘సాహసం శ్వాసగా సాగిపో’. గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ప్రేమమ్‌’తో ఈమధ్యే కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేసిన నాగ చైతన్య, ‘సాహసం శ్వాసగా సాగిపో’తో మరో హిట్ కొడతారన్న ప్రచారంతో సినిమా పెద్ద ఎత్తున విడుదలైంది.

ఇక గౌతమ్ మీనన్ మార్క్ రొమాన్స్, యాక్షన్ కలగలిసిన ఈ సినిమాకు మొదటిషో నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు ‘ప్రేమమ్’ స్థాయి అంచానాలేం లేని ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకూ 235కే డాలర్లు వసూలు చేసి మంచి ఓపెనింగ్స్‌నే తెచ్చుకుందని చెప్పాలి. వచ్చేవారాంతం కూడా యూఎస్‌లో ఈ క్లాస్ సినిమాకే బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్ ఉంటుందని ట్రేడ్ భావిస్తోంది.