ఇంకొద్దిసేపట్లో విడుదలకానున్న ‘సాహో’ ఫస్ట్ లుక్ !
Published on Oct 23, 2017 8:19 am IST


యంగ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిన సంగతే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కావడంతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలు మిళితమైనందు వలన ఈ చిత్రానికి జాతీయ స్థాయి క్రేజ్ ఏర్పడింది. ఇది వరకే విడుదలైన ఈ చిత్రం తాలూకు చిన్నపాటి వీడియో బాగా వైరల్ అవడంతో ఫస్ట్ లుక్ పై ఎక్కడా లేని హైప్ నెలకొంది.

అందుకే చిత్ర టీమ్ ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనుంది. ఉదయం 9 గంటల 30 నిముషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్మాతలు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తమవుతున్న ఈ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా బాలీవుడ్ అందాల నటి శ్రద్ద కపూర్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అంతేగాక నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్, మందిరా బేడీ వంటి పలువురు హిందీ నటులు ఇందులో నటిస్తున్నారు.

 
Like us on Facebook