‘బాహుబలి’ 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ గా విడుదల కి సిద్ధమౌతోంది. కాగా తాజాగా సాహో ట్రైలర్ ను జూన్ 13 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం ఈ సినిమాలో మరో ప్రత్యేకత. ఇంతటి భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.
The action BEGINS ?
Enter the world of #SAAHO with the teaser on 13th June.Experience it in theaters from 14th June! ? #Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations #SaahoTeaser #15AugWithSaaho pic.twitter.com/yxj6bLmPtA
— UV Creations (@UV_Creations) June 10, 2019