రేపటి నుండి హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకోనున్న ‘సాహో’ !

8th, January 2018 - 05:34:53 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ ముందుగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం దుబాయ్ లోను బుర్జ్ ఖలీఫా వద్ద చిత్రీకరణ జరపాలని ప్లాం చేసిన సంగతి తెలిసిందే. కానీ అనుమతుకు ఆలస్యమవుతున్న కారణంగా ఆ షెడ్యూల్ ను పక్కనబెట్టి హైదరాబాద్ షెడ్యూల్ కు సిద్ధమయ్యారు టీమ్.

ఈ షెడ్యూల్ రేపటి నుండి మొదలుకానుంది. ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్, ఈషాన్, లోయ్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. సుజీత్ డైరెక్షన్లో యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు.