ప్రభాస్ పై ప్రముఖుల ప్రశంసలు !

Published on Aug 17, 2019 11:06 pm IST

సాహో మేనియా మూవీ అభిమానుల మెదళ్ళు లోకి చొచ్చుకు పోయింది. ప్రభాస్ ను సిల్వర్ స్క్రీన్ పై భయంకరమైన పోరాటాలు, మత్తెక్కించే రొమాన్స్, కిక్కెకించే డైలాగ్స్ చెవుతుంటే వినాలని,చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంవత్సరాల నుండి నెలలకు, నెలల నుండి రోజులకు చేరిన వారి నిరీక్షణకు ఇంకా 13 రోజులలో తెరపడనుంది.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, వెన్యూ రెండు రోజుల క్రితం ప్రకటించేశారు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా రేపు సాయంత్రం 5గంటల నుండి భారీగా ఏర్పాటు చేసిన వేదిక పై సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేదికపై ఈవెంట్ కి హాజరైన అభిమానుల కొరకు సరికొత్త ప్రోగ్రామ్స్ తో ఆహ్లాదం కలిగించే ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తుంది. హీరో ప్రభాస్,హీరోయిన్ శ్రద్దా కపూర్ లతో పాటు,నిర్మాతలు, చిత్రంలో నటించిన వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులతో పాటు, టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.

ఈసందర్బంగా గతంలో పలు వేదికలపై, ఇతర సందర్బాలలో ప్రభాస్ పై ప్రముఖుల ప్రశంసల సమాహారంతో ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియోలో రాజమౌళి
నాన్న గారు విజయేంద్ర ప్రసాద్ గతంలో బాహుబలి మూవీ వేడుకలో బాహుబలి కథ రాయడం వెనుక అసలు కారణాన్ని ఆసక్తికరంగా చెప్పారు. రాజమౌళి కోరిక మేరకు ఆయన పోరాటాలతో కూడిన భావోద్వేగ రాజుల కథ కావాలంటే ఆ కథ రాశారట. ఇంకా ఆ వీడియోలో బ్రహ్మనందం, పూరి వంటి ప్రముఖులు ప్రభాస్ పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో సాగింది.

వీడియో కొరకు ఎక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :