సంవత్సరం ఆఖరుకల్లా పూర్తికానున్న ‘సాహో’ !

ప్రసుతం టాలీవుడ్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘సాహో’ కూడా ఒకటి. ‘బాహుబలి’ ఘన విజయం తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మధ్యే హైదరాబాద్లో చిన్నపాటి షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరు నుండి దుబాయ్ వెళ్లనున్నారు.

అక్కడే సుమారు రెండు నెలల పాటు షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలని రూపొందించనున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆఖరుకల్లా పూర్తవుతుందని, 2019 జనవరికి సినిమా బయటికొచ్చే ఛాన్సుందని సినిమాటోగ్రాఫర్ మది తెలిపారు. శ్రద్దా కపూర్ తో పాటు పలువురు బాలీవుడ్ నటీ నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.