‘సాక్ష్యం’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

ఇటీవలే ‘జయ జానకి నాయక’ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ నడుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘సాక్ష్యం’ అనే సినిమా చేస్తున్నారు. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కతుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది.

ఇటీవలే రిలీజైన చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ కు మంచి స్పందన లభించగా ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను సిద్ధం చేస్తున్నారు టీమ్. ఈ ఫస్ట్ లుక్ ను సంక్రాంతి సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. వారణాసి, దుబాయ్ వంటి చోట్ల షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనాలు పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.