దుబాయ్ లో బెల్లంకొండ ‘సాక్ష్యం’ షూటింగ్ !

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్లో ‘సాక్ష్యం’ అనే సినిమా చేస్తున్నారు. శ్రీనివాస్ గత చిత్రం ‘జయ జానకి నాయక’ మంచి కామర్హియల్ విజయాన్ని అందుకోవడం, ఈ చిత్రం ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా రూపొందుతుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. అక్కడే హీరో మీద ఇంట్రడక్షన్ సాంగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హీరోయిన్ పూజ హెగ్డే కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనాలు పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.