డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “శాకిని డాకిని”

Published on Sep 29, 2022 3:00 pm IST

రెజీనా కసాండ్రా మరియు నివేతా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన శాకిని డాకిని సెప్టెంబర్ 16, 2022 న థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొరియన్ హిట్ మిడ్‌నైట్ రన్నర్స్ యొక్క అధికారిక రీమేక్. తాజా వార్త ఏమిటంటే, శాకిని డాకిని డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం సెప్టెంబర్ 30, 2022 నుండి తెలుగు, తమిళం మరియు మలయాళంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీన్ని సినిమాల్లో మిస్ అయిన వారు రేపటి నుండి నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పృధ్వీ, రవివర్మ, కబీర్ దుహన్ సింగ్, భాను చందర్, పృధ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి మైకీ మెక్‌క్లీరీ సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :