వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “శాకిని డాకినీ”

Published on Dec 22, 2022 5:00 pm IST

ప్రముఖ నటీమణులు నివేదా థామస్ మరియు రెజీనా కసాండ్రా చేతులు కలిపి శాకిని డాకినీ అనే చిత్రాన్ని అందించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఓటిటి లో మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అవుతోంది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా ఈ చిత్రాన్ని ఈ శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.

థియేటర్లలో మరియు ఓటిటి లో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు చిన్న బుల్లితెర పై ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు. పృధ్వీ, రవివర్మ, కబీర్ దుహన్ సింగ్, భాను చందర్, పృధ్వీ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ పతాకాల పై నిర్మించిన ఈ చిత్రానికి మైకీ మెక్‌క్లియరీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :