“పుష్ప” నుండి సామీ సామీ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

“పుష్ప” నుండి సామీ సామీ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Published on Jan 7, 2022 1:01 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం థియేటర్ల లో ఏ తరహా వసూళ్లను రాబడుతుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించడం జరిగింది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఈ చిత్రం నుండి తాజాగా సామీ సామీ ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా, మిగతా బాషల్లో సైతం ఈ పాటను విడుదల చేయడం జరిగింది. సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్, ధనంజయ, అజయ్ ఘోష్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండవ భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు