పుష్ప నుండి “సామీ సామీ” థర్డ్ సింగిల్ గ్లింప్స్ రిలీజ్

Published on Oct 25, 2021 5:25 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా ల పై ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని మరియు వై శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అభిమానుల్లో ఆసక్తి నీ పెంచేశాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ విడుదల కి సిద్దం అవుతోంది.

సామీ సామీ అంటూ మూడవ పాట కి సంబంధించిన గ్లింప్స్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. మంచి ఫోక్ సాంగ్ గా ఉండటం తో విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. యూ ట్యూబ్ లో సైతం మంచి వ్యూస్ తో దూసుకు పోతుంది. ఈ సామీ సామీ పూర్తి పాట అక్టోబర్ 28 వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్నా నటిస్తుండగా, విలన్ పాత్రలో మలయాళ నటుడు ఫాహద్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :