పుష్ప నుండి హిందీ వెర్షన్ “సామీ సామీ” లిరికల్ వీడియో విడుదల

Published on Dec 13, 2021 6:15 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటిస్తుండగా, బన్నీ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పాన్ ఇండియా మూవీ కావడం తో ఇతర బాషల్లో కూడా అదే తరహాలో హైప్ తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ చిత్రం నుండి హిందీ వెర్షన్ కి సంబంధించిన సామీ సామీ అనే లిరికల్ వీడియో ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే తెలుగు లో విడుదలైన అన్ని పాటలు ఒక రేంజ్ లో హిట్ కాగా, సినిమా పై ఆసక్తి నెలకొంది. మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :