సామి అక్కడ బాగానే రాబడుతున్నాడు !

చియాన్ విక్రమ్ నటించిన ‘సామి’ చిత్రం ఇటీవల విడుదలై నెగిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక టాక్ కూడా నెగిటివ్ గా రావడంతో తెలుగులో ఈచిత్రం ఓపెనింగ్స్ కూడా సాధించలేకపోయింది. కానీ తమిళనాడులో మాత్రం ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. తమిళ చిత్రం కావడం పైగా విక్రమ్ కు అక్కడ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడంతో 16కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక చెన్నైలో ఈచిత్రం 3రోజులకుగాను రూ. 1.64 కోట్లను కలెక్ట్ చేసింది.

యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో హరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. శిబూ తమీన్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచారు.

Exit mobile version