ఆచార్య నుండి హై ఓల్టేజ్ పార్టీ సాంగ్ పై అద్దిరిపోయే అప్డేట్..!

Published on Dec 31, 2021 4:59 pm IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం ను కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్ని ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రం కి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ పై చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి సానా కష్టం అనే లిరికల్ వీడియో సాంగ్ ను జనవరి 3 వ తేదీన సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ తో ప్రకటించడం జరిగింది. హై ఓల్టేజ్ పార్టీ సాంగ్ గా అభివరిస్తూ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. 2022 ను ఈ హై ఓల్టేజ్ పార్టీ సాంగ్ తో మొదలు పెట్టనున్నారు ఆచార్య చిత్ర యూనిట్. ఈ చిత్రం లో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూ సూద్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :