“ఆచార్య” హై ఓల్టేజ్ పార్టీ సాంగ్ ప్రోమోకి ముహూర్తం ఫిక్స్..!

Published on Jan 2, 2022 12:02 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆచార్య”. ఇందులో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ ఫిబ్రవరి 4వ తేదిన రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి “సానా కష్టం” అనే హై ఓల్టేజ్ పార్టీ సాంగ్ లిరికల్ వీడియోను జనవరి 3వ తేదీన సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ హై ఓల్టేజ్ పార్టీ సాంగ్ ప్రోమోను రేపు ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే కొణిదెల ప్రొడక్షన్ మరియు మాట్ని ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :