
వరుసగా బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ సినిమాలు కానీ సినిమాలు ఆపాడు, ఒకేసారి 3 లేదా 4 సినిమాలు చేస్తుంటాడు. అలాగే ఏదో ఒక విషయం మీద కామెంట్ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు.. ఇప్పటికే ఎవరు అనేది తెలిసిపోయి ఉంటుంది.. అతనే మన రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం రెండు తెలుగు, ఒక హిందీ సినిమాతో రామ్ గోపాల్ వర్మ బిజీగా ఉన్నాడు. తెలుగులో శ్రీ దేవి, ఎటాక్ సినిమాలు సెట్స్ పై ఉండగా ‘365 డేస్’ అనే సినిమాని రిలీజ్ కి సిద్దం చేస్తున్నాడు.
ఇది పక్కన పెడితే హిందీలో తన కంబ్యాక్ కోసం ‘ఏక్ ఎఫైర్’ అనే థ్రిల్లర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సచిన్ జోషి, మీరా చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు మరియు హిందీ భాషల్లో షూట్ చేస్తున్నారు. సచిన్ జోషి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ సగానికల్లా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో వర్మ ఉన్నాడు. అలాగే ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేసి రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో వర్మ ఉన్నాడు, సత్య 2 తో ఫ్లాప్ నే అందుకున్న వర్మ ఈ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ లో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.